Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుకూ తప్పని ట్రాఫిక్ తిప్పలు!

  • గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళుతుండగా ట్రాఫిక్
  • బెంజ్ సర్కిల్ వద్ద చిక్కుకుపోయిన వాహనం
  • వెంటనే అప్రమత్తమైన పోలీసులు
సామాన్యులకే కాదు, ఏపీ సీఎం చంద్రబాబుకూ ట్రాఫిక్ తిప్పలు తప్పలేదు. రేపు జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు చంద్రబాబు శ్రీకాకుళం బయలుదేరి వెళ్తుండగా ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళుతుండగా స్థానిక బెంజి సర్కిల్ వద్ద చంద్రబాబు ప్రయాణిస్తున్న వాహనం ట్రాఫిక్ లో చిక్కుకుపోయింది. దీంతో, వెంటనే అప్రమత్తమైన పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు. కాగా, మొదట, వైజాగ్ వెళ్లి అక్కడి నుంచి చంద్రబాబు శ్రీకాకుళం వెళ్లనున్నట్టు సమాచారం.
Chandrababu
benji company
traffic

More Telugu News