Rahul Gandhi: తెలంగాణలో ముగిసిన రాహుల్ పర్యటన

  • తెలంగాణలో రెండు రోజులు పర్యటించిన రాహుల్
  • శంషాబాద్ లో ఢిల్లీ విమానం ఎక్కిన కాంగ్రెస్  అధ్యక్షుడు
  • ఘనంగా వీడ్కోలు పలికిన పార్టీ నేతలు
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన ముగిసింది. తెలంగాణలో రెండు రోజుల పర్యటన నిమిత్తం నిన్న హైదరాబాద్ కు రాహుల్ వచ్చారు. తొలి రోజు మహిళా సంఘాలతో సమావేశం జరిపి, శేరిలింగంపల్లి బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ఈరోజు ఉదయం పత్రికా సంపాదకులతో సమావేశం, పారిశ్రామికవేత్తలతో మీటింగ్ తో పాటు, గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు రాహుల్ నివాళులర్పించారు.

అనంతరం, అక్కడి నుంచి బయలుదేరి సరూర్ నగర్ లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమం అనంతరం రాహుల్ తిరిగి ఢిల్లీ బయలుదేరారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీ విమానం ఎక్కిన రాహుల్ కు కాంగ్రెస్ పార్టీ నేతలు, నాయకులు ఘనంగా వీడ్కోలు పలికారు.    
Rahul Gandhi
Telangana

More Telugu News