allu arjun: మొత్తానికి విక్రమ్ కుమార్ తోనే బన్నీ మూవీ ఖాయమైంది

  • కథతో బన్నీని ఒప్పించిన విక్రమ్ కుమార్
  • కథానాయికల కోసం అన్వేషణ 
  • త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు   
'నా పేరు సూర్య' పరాజయం తరువాత బన్నీ కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఈ సారి చేసే సినిమా తప్పకుండా హిట్ తెచ్చిపెట్టాలనే పట్టుదలతో ఆయన వున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయనకి విక్రమ్ కుమార్ ఒక కథ వినిపించాడు. ఫస్టాఫ్ పట్ల మాత్రమే బన్నీ సంతృప్తిని వ్యక్తం చేశాడు .. సెకండాఫ్ విషయంలో విక్రమ్ కుమార్ ఒప్పించలేకపోతే ఆ సినిమా ఉండదనే టాక్ వినిపించింది.

ఈలోగా, త్రివిక్రమ్ తో చేయాలనే ఉద్దేశంతో బన్నీ ఉన్నాడనే ప్రచారం కూడా జరిగింది. అయితే, బన్నీ తదుపరి సినిమా విక్రమ్ కుమార్ తోనే వుండనుందనేది తాజా సమాచారం. ఇటీవలే సెకండాఫ్ కి మెరుగులు దిద్ది, చెప్పిన విక్రమ్ కుమార్ ఆఖరుకి బన్నీని ఒప్పించాడట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. ప్రస్తుతం కథానాయికల అన్వేషణలో ఉన్నారట .. త్వరలోనే కథానాయికల పేర్లను ప్రకటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహ్మాన్ ను ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. 
allu arjun
vikram kumar

More Telugu News