Rahul Gandhi: ఏపీలో అధికారంలోకి రావడం కష్టం.. తెలంగాణలో వస్తాం: రాహుల్ గాంధీ

  • ఏపీలో కాంగ్రెస్ బలపడుతుంది
  • స్థానిక నేతల అభిప్రాయాలమేరకే ఇతర పార్టీలతో పొత్తులు
  • మహిళా రిజర్వేషన్ల బిల్లుకు కట్టుబడి ఉన్నాం
రానున్న ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కష్టమని ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అయితే, రాష్ట్రంలో బలపడతామని ఆయన అన్నారు. తెలంగాణలో మాత్రం అధికారంలోకి వస్తామనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న రాహుల్... ఈ ఉదయం హరితప్లాజాలో మీడియా ముఖ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళా రిజర్వేషన్ల బిల్లుకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పొత్తులు స్థానిక నేతల అభిప్రాయాలకు అనుగుణంగానే ఉంటాయని తెలిపారు. కాంగ్రెస్ విధానాలను గౌరవించే పార్టీలతోనే పొత్తులు ఉంటాయని ఆయన చెప్పారు. 
Rahul Gandhi
hyderabad
Andhra Pradesh
Telangana

More Telugu News