Andhra Pradesh: చిత్తూరులో దారుణం.. ఎన్టీఆర్ గృహకల్పపై ప్రశ్నించినందుకు దళితుడిపై టీడీపీ నేతల హత్యాయత్నం!

  • కత్తులతో వెంకటరామయ్యపై దాడి
  • దాడిచేసిన టీడీపీ నేతలు
  • బాధితుడి పరిస్థితి విషమం
చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. ఎన్టీఆర్ గృహకల్ప పథకంలో ఇళ్ల కేటాయింపును ప్రశ్నించినందుకు సోమల మండలం ఇరిపెంటలో ఓ దళితుడిపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. టీడీపీ నేత, మాజీ సర్పంచ్ శ్రీనివాసులు నాయుడుతో పాటు మరో ఆరుగురు దళితుడు వెంకటరామయ్యపై ఈ రోజు ఉదయం కత్తులతో దాడికి దిగారు. చివరికి అతను స్పృహ కోల్పోవడంతో చనిపోయాడనుకుని అక్కడి నుంచి పరారయ్యారు.

శ్రీనివాసులు నాయుడు, వెంకటరామయ్య మధ్య భూతగాదాలు ఉన్నాయి. దీనికితోడు ఎన్టీఆర్ గృహకల్ప పథకం కింద దరఖాస్తు చేసుకున్నా.. తనకు కేటాయించకపోవడంపై వెంకటరామయ్య టీడీపీ నేతలను ప్రశ్నించాడు. దీంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఏడు గంటలకు వెంకటరామయ్యపై కత్తులతో దాడికి దిగారు. దీంతో అతను స్పృహ కోల్పోవడంతో అక్కడి నుంచి పారిపోయారు. ప్రస్తుతం వెంకటరామయ్య పరిస్థితి విషమంగా ఉంది.
Andhra Pradesh
Telugudesam
attack
Chandrababu
Chittoor District

More Telugu News