KCR: కేసీఆర్ దేన్నైనా మగాడిలా ఎదుర్కొంటాడు.. ఏది చేసినా పక్కాగా చేస్తాడు!: కేసీఆర్

షార్ట్స్‌లో చూడండి
కేసీఆర్ దేన్నైనా మగాడిలా ఎదుర్కొంటాడని, లోపాయికారి ఒప్పందాలు చేసుకోడని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు చెప్పుకొచ్చారు. ఏది చేసినా పక్కాగా చేస్తామన్నారు. నిన్న ప్రగతి భవన్‌లో నిర్వహించిన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం కేసీఆర్ విలేఖరులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్‌కు లోపాయికారి ఒప్పందాలు చేసుకునే ఖర్మ పట్టలేదన్నారు. కేసీఆర్ దేన్నైనా మగాడిలా చేస్తాడన్నారు. తన ప్రభుత్వంపై రాహుల్ విమర్శలను ప్రస్తావిస్తూ.. ఏది పడితే అది మాట్లాడవద్దని రాహుల్‌కు విజ్ఞప్తి చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో నిజంగానే ఏవైనా సమస్యలు ఉంటే మాట్లాడాలి తప్ప ఏదో ఒకటి మాట్లాడవద్దని సూచించారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉందని, దానిని అలాగే ఉండనివ్వాలని రాహుల్‌ను కోరారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు గురించి మాట్లాడుతూ కాంగ్రెస్సేతర, బీజేపీయేతర కూటమి ఏర్పాటు కోసం జరుగుతున్న ప్రయత్నాలను ఆపబోనని కేసీఆర్ స్పష్టం చేశారు.
Go Back to Shorts
KCR
Rahul Gandhi
Telangana
TRS
Congress

More Telugu News