Jagan: జగన్ మనుషులు ఆ ఘటనలో ఉండడం వల్లే కేసుల మాఫీ అంటున్నారు!: ఏపీ మంత్రి నారాయణ

  • జగన్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరు
  • తుని విధ్వంసం కేసులో ఆయన మనుషులున్నారు
  • పీడీ అకౌంట్స్‌పై జగన్‌కు అవగాహన లేదు
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. తుని విధ్వంసం కేసులో జగన్ మనుషులు ఉండడం వల్లే అధికారంలోకి రాగానే కేసులు మాఫీ చేస్తానని కొత్త పల్లవి అందుకున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై బురద జల్లడం తప్ప ఆయన మరేమీ చేయడం లేదని ఎద్దేవా చేశారు. జగన్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని మంత్రి తేల్చి చెప్పారు.

పీడీ అకౌంట్స్‌పై జగన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. పీడీ అకౌంట్స్ అనేవి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే పుట్టుకు రాలేదని, గత ప్రభుత్వాల నుంచీ అవి ఉన్నాయన్న సంగతిని తెలుసుకోవాలని హితవు పలికారు. నిధులు దుర్వినియోగం అవుతున్నాయని చెబుతున్న జగన్ అందుకు సంబంధించిన ఆధారాలు బయటపెట్టాలని మంత్రి నారాయణ సవాల్ విసిరారు.
Jagan
YSRCP
Andhra Pradesh
Minister
Narayana
PD Accounts

More Telugu News