'శ్రీనివాస కళ్యాణం' నాలుగు రోజుల వసూళ్లు
- దిల్ రాజు నిర్మాణంలో 'శ్రీనివాస కళ్యాణం'
- వివాహం గొప్పతనాన్ని చాటే కథాకథనాలు
- నితిన్ సరసన కథానాయికగా రాశి ఖన్నా
అయినప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో తొలి నాలుగు రోజుల్లో ఈ సినిమా 8.5 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ రోజు నుంచి కూడా ఈ సినిమా వసూళ్ల పరంగా తన జోరు చూపించవలసి వుంది. మరో రెండు రోజుల్లో 'గీత గోవిందం' థియేటర్లకు రానుంది. విజయ్ దేవరకొండ .. రష్మిక మందన జంటగా నటించిన ఈ సినిమాపై యూత్ లో విపరీతమైన క్రేజ్ వుంది. అందువలన ఈ సినిమా విడుదల .. 'శ్రీనివాస కళ్యాణం' వసూళ్లపై ప్రభావం చూపించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.