Nara Lokesh: మనమంతా చివరకు వెళ్లేది శ్మశానానికే!: నారా లోకేష్

  • కోరిటెపాడులో వైకుంఠధామాన్ని ప్రారంభించిన లోకేష్
  • 2020 నాటికి శ్మశానవాటికలన్నింటినీ అభివృద్ధి చేస్తామన్న మంత్రి
  • శ్మశానాలంటే దెయ్యాలు, భూతాలు కాదన్న స్పీకర్
గుంటూరు జిల్లా కోరిటెపాడులో వైకుంఠధామాన్ని ఈరోజు మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2020 నాటికి రాష్ట్రంలో శ్మశానవాటికలు అన్నింటినీ అభివృద్ధి చేస్తామని చెప్పారు. అందరూ చివరకు వెళ్లేది శ్మశానానికేనని, వాటిని అభివృద్ధి చేస్తుండటం సంతోషకరమని అన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ కోడెల మాట్లాడుతూ శ్మశానవాటికల్లో ఉండేది దెయ్యాలు, భూతాలు కాదని... దేవుళ్లు ఉంటారని చెప్పారు. శ్మశానాలంటే దెయ్యాలు, భూతాలు అనే భావనను ప్రజల్లో నుంచి తొలగించి, వాటిని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.
Nara Lokesh
kodela

More Telugu News