nani: హరీశ్ శంకర్ దర్శకత్వంలో నాని?

  • మల్టీస్టారర్ చేయాలనుకున్న హరీశ్ 
  • కొన్ని కారణాల వలన వెనక్కి 
  • 14 రీల్స్ బ్యానర్ పై తాజా చిత్రం
తెలుగులో మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుల జాబితాలో హరీశ్ శంకర్ ఒకరుగా కనిపిస్తాడు. 'మిరపకాయ్' .. 'గబ్బర్ సింగ్' .. 'దువ్వాడ జగన్నాథం' సినిమాలు హరీశ్ శంకర్ శైలికి అద్దం పడతాయి. అలాంటి హరీశ్ శంకర్ 'దాగుడు మూతలు' అనే మల్టీస్టారర్ మూవీని రూపొందించనున్నట్టు కొంతకాలంగా వార్తలు వచ్చాయి. అయితే కొన్ని కారణాల వలన ఆయన ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేయవలసి వచ్చింది.

దాంతో ఆయన తాజా చిత్రం ఏ హీరోతో వుండనుందా అనే ఆసక్తి ఫిల్మ్ నగర్లో కనిపిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఆయన తాజా చిత్రం నానితో ఉంటుందనేది లేటెస్ట్ న్యూస్. ఇటీవల నానిని కలిసిన హరీశ్ శంకర్ ఒక కథ వినిపించడం .. ఆయన ఓకే చెప్పేయడం జరిగిపోయాయని అంటున్నారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు ఈ సినిమాను నిర్మించనున్నట్టు చెబుతున్నారు. ఇంతకుముందు ఈ బ్యానర్లో నాని 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' చేసి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. 
nani
harish shankar

More Telugu News