జన్‌ధన్ ఖాతాదారులకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమైన మోదీ.. ఆగస్టు 15న తాయిలాల ప్రకటన!
- 32 కోట్ల మంది జన్‌ధన్ ఖాతాదారులకు తాయిలాలు
- ఓవర్ డ్రాఫ్ట్‌ను రెట్టింపు చేసే అవకాశం
- అసంఘటిత రంగానికీ వరాలు
ఇప్పటి వరకు ఇది రూ. 5 వేలకే పరిమితం కాగా, ఇప్పుడు దీనిని రూ.10 వేలకు పెంచబోతున్నారని సమాచారం. అలాగే, అసంఘటిత రంగంలోని కార్మికులకు వర్తించే ‘అటల్ ఫించన్ యోజన’ పథకం కింద పింఛను పరిమితిని రూ. 5 వేల నుంచి రూ.10 వేలకు పెంచనున్నట్టు కూడా తెలుస్తోంది. రుపే కార్డు ఖాతాదారుల బీమాను రూ. లక్ష వరకు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.