Gujarath: గుజరాత్‌ లో రోడ్డు ప్రమాదం.. ఏడుగురు చిన్నారుల దుర్మరణం!

  • గుజరాత్ లోని పంచమహల్ లో ప్రమాదం
  • కాలువలోకి దూసుకెళ్లిన కారు
  • ముగ్గురిని రక్షించిన స్థానికులు
గుజరాత్‌ లోని పంచమహల్ సమీపంలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 10 మందితో ప్రయాణిస్తున్న ఓ కారు అదుపుతప్పి  పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లగా, ఏడుగురు చిన్నారులు మృతిచెందారు. కారు కాలువలో పడిన విషయాన్ని గమనించి స్థానికులు వారిని రక్షించేందుకు ప్రయత్నించేలోపే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. కారు నుంచి ముగ్గురు పెద్దవాళ్లను మాత్రం రక్షించినట్టు తెలుస్తోంది. ఈ ముగ్గురికీ గాయాలు కాగా, పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. మృతిచెందిన పిల్లలంతా ఏడు నుంచి 16 సంవత్సరాల మధ్య వయసువారే. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. మృతుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు.
Gujarath
Pancha Mahal
Road Accident

More Telugu News