వైసీపీ నేత కాసు మహేశ్ రెడ్డి ఇంటి వద్ద మోహరించిన పోలీసులు.. నరసరావుపేటలో ఉద్రిక్తత
- నేడు మైనింగ్ అక్రమ ప్రదేశంలో పర్యటించనున్న వైసీపీ నేతలు
- అడ్డుకునేందుకు సిద్ధమైన పోలీసులు
- మహేశ్ రెడ్డి ఇంటికి వెళ్లే దారిలో బారికేడ్ల ఏర్పాటు
వైసీపీ నిజనిర్ధారణ కమిటీ ఆ ప్రాంతాల్లో పర్యటిస్తే సాక్ష్యాలు మాయమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు నోటీసులు కూడా పంపినట్టు చెబుతున్నారు. మరోవైపు మహేశ్ రెడ్డి ఇంటి నుంచి బయటకు వస్తే అరెస్ట్ చేస్తామని పోలీసులు హెచ్చరించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.