YSRCP: వైసీపీ నేత కాసు మహేశ్ రెడ్డి ఇంటి వద్ద మోహరించిన పోలీసులు.. నరసరావుపేటలో ఉద్రిక్తత

  • నేడు మైనింగ్ అక్రమ ప్రదేశంలో పర్యటించనున్న వైసీపీ నేతలు
  • అడ్డుకునేందుకు సిద్ధమైన పోలీసులు
  • మహేశ్ రెడ్డి ఇంటికి వెళ్లే దారిలో బారికేడ్ల ఏర్పాటు
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, దాచేపల్లిలోని మైనింగ్ అక్రమ క్యారింగ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిజనిర్ధారణ కమిటీ పర్యటించనున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. నరసరావుపేటలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కాసు మహేశ్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆయన ఇంటికి వెళ్లే దారిలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.

వైసీపీ నిజనిర్ధారణ కమిటీ ఆ ప్రాంతాల్లో పర్యటిస్తే సాక్ష్యాలు మాయమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు నోటీసులు కూడా పంపినట్టు చెబుతున్నారు. మరోవైపు మహేశ్ రెడ్డి ఇంటి నుంచి బయటకు వస్తే అరెస్ట్ చేస్తామని పోలీసులు హెచ్చరించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 
YSRCP
Guntur District
Narasaraopet
kasu mahesh reddy

More Telugu News