బిగ్‌బాస్ నుంచి బాబు గోగినేని అవుట్.. చాలా ఎంజాయ్ చేశానన్న బాబు!
- బాబు తీరుపై నెటిజన్ల ఫైర్
- అతడికి వ్యతిరేకంగా ఓట్లు
- రోల్ రిడాపై బిగ్ బాంబ్ ప్రయోగించిన గోగినేని
ఓసారి హౌస్‌లో బాబు మాట్లాడుతూ.. ఇక్కడ తానైనా ఉండాలి.. కౌశల్ అయినా ఉండాలి అంటూ శపథం కూడా చేశారు. ఒకవేళ బయటకు వెళ్లినా కౌశల్‌ను మాత్రం వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కౌశల్ అభిమానులు ఇక సహించలేకపోయారు. అతడికి వ్యతిరకంగా ఓట్లు వేసి బయటకు పంపేశారు. బాబు బయటకు వెళ్తూ బిగ్‌బాంబ్‌ను రోల్ రిడాపై ప్రయోగించారు. దీని ప్రకారం ఈ వారం మొత్తం రోల్ టాయిలెట్లను శుభ్రం చేయాలి. కాగా, హౌస్ నుంచి బయటకు వచ్చిన బాబు మాట్లాడుతూ.. ఇక్కడకు వచ్చాక చాలా బాగా ఎంజాయ్ చేశానని, మరోమారు ఇటువంటి అవకాశం వస్తుందని అనుకోవడం లేదని పేర్కొన్నారు.