Big Boss: బిగ్‌బాస్ నుంచి బాబు గోగినేని అవుట్.. చాలా ఎంజాయ్ చేశానన్న బాబు!

  • బాబు తీరుపై నెటిజన్ల ఫైర్ 
  • అతడికి వ్యతిరేకంగా ఓట్లు 
  • రోల్ రిడాపై బిగ్ బాంబ్ ప్రయోగించిన గోగినేని
బిగ్‌బాస్ హౌస్ నుంచి ఈ వారం బాబు గోగినేని బయటకొచ్చేశారు. హౌస్‌లో పెద్దమనిషిగా వ్యవహరిస్తూ వచ్చిన ఆయన గత కొద్దికాలంగా కౌశల్‌తో ప్రతీ విషయంలోనూ విభేదిస్తూ వస్తున్నారు. వీరిద్దరికీ అస్సలు పడడం లేదు. కౌశల్‌ను అభిమానించే వారికి ఇది ఎంతమాత్రమూ నచ్చలేదు. అంతేకాదు, నెటిజన్లు కూడా బాబు గోగినేనిపై మండిపడుతున్నారు. ఆయన ప్రవర్తన బయట ఒకలా, లోపల మరోలా ఉందని ఆరోపిస్తున్నారు. హౌస్‌లో అందరితోనూ సఖ్యతగా ఉండే బాబు.. కౌశల్‌ను మాత్రం శత్రువులా చూడడాన్ని కౌశల్ అభిమానులు తట్టుకోలేకపోయారు. దీంతో అతడికి వ్యతిరేకంగా ఓట్లు వేసి బయటకు పంపించి వేశారు.

ఓసారి హౌస్‌లో బాబు మాట్లాడుతూ.. ఇక్కడ తానైనా ఉండాలి.. కౌశల్ అయినా ఉండాలి అంటూ శపథం కూడా చేశారు. ఒకవేళ బయటకు వెళ్లినా కౌశల్‌ను మాత్రం వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కౌశల్ అభిమానులు ఇక సహించలేకపోయారు. అతడికి వ్యతిరకంగా ఓట్లు వేసి బయటకు పంపేశారు. బాబు బయటకు వెళ్తూ బిగ్‌బాంబ్‌ను రోల్ రిడాపై ప్రయోగించారు. దీని ప్రకారం ఈ వారం మొత్తం రోల్ టాయిలెట్లను శుభ్రం చేయాలి. కాగా, హౌస్ నుంచి బయటకు వచ్చిన బాబు మాట్లాడుతూ.. ఇక్కడకు వచ్చాక చాలా బాగా ఎంజాయ్ చేశానని, మరోమారు ఇటువంటి అవకాశం వస్తుందని అనుకోవడం లేదని పేర్కొన్నారు. 
Big Boss
Babu Gogineni
Kaushal
Eliminate
Actor Nani

More Telugu News