Jagan: జగన్ అధికారంలోకొచ్చినా చంద్రబాబు తరహా పాలనే ఉంటుంది: సీపీఐ నేత రామకృష్ణ

  • వామపక్షాలు, ‘జనసేన’ సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్ 
  • సెప్టెంబర్ 15న విజయవాడలో మహాగర్జన నిర్వహిస్తాం
  • రాష్ట్రంలో అభివృద్ధి కంటే అప్పులు బాగా పెరిగాయి
ఒకవేళ జగన్ అధికారంలోకి వచ్చినా చంద్రబాబు తరహా పాలనే ఉంటుందని అన్నారు. వామపక్షాలు, జనసేన పార్టీ ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్ పేరు ప్రకటించే అవకాశముందని సీపీఐ నేత రామకృష్ణ వెల్లడించారు. సీపీఐ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 15న విజయవాడలో మహాగర్జన నిర్వహిస్తామని, హిందూపురం, ఇచ్ఛాపురం నుంచి బస్సుయాత్రలు చేపడతామని తెలిపారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి కంటే అప్పులు బాగా పెరిగాయని విమర్శించారు. వామపక్షాలు, జనసేన పార్టీ ముఖ్యనేతలు రేపు విజయవాడలో చర్చించే అవకాశం ఉందని చెప్పారు. 
Jagan
cpi
ramakrishna

More Telugu News