Chandrababu: చంద్రబాబుపై బీజేపీ నేత మురళీధరరావు తీవ్ర వ్యాఖ్యలు

  • బాబును గుంటూరు మిరపకాయలపై కూర్చోబెడతాం
  • మోసం, ద్రోహం గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదు
  • ఏపీలో బీజేపీ నెంబర్ వన్ అవుతుంది
ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై బీజేపీ నేత మురళీధరరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో చంద్రబాబును గుంటూరు మిరపకాయలపై కూర్చోబెడతామని వ్యాఖ్యానించారు. మోసం, ద్రోహం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని విమర్శించారు. ఇచ్చిన మాటపై నిలబడే పార్టీ బీజేపీ అని చెప్పిన మురళీధరరావు, ఏపీలో తమ పార్టీ నెంబర్ వన్ అవుతుందని అభిప్రాయపడ్డారు.

కాగా, బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు మాట్లాడుతూ, ఏపీకి ఎంత చేస్తున్నా మోదీ ప్రభుత్వంపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో కేంద్ర పథకాలు అమలవుతున్నప్పటికీ మోదీ ఫొటో మాత్రం కనిపించడం లేదని విమర్శించారు. మోదీ హయాంలో దేశంలో వేగంగా అభివృద్ధి జరుగుతోందని అన్నారు.
Chandrababu
bjp
muralidhar rao

More Telugu News