mudragada: రూ.20 వేల కోట్లు ఇస్తాం.. సీఎం పదవిని వేరే కులస్తులకు ఇస్తారా?: జగన్ కు ముద్రగడ ఛాలెంజ్

  • కాపు సేవా సమితి వార్షికోత్సవంలో పాల్గొన్న ముద్రగడ  
  • కాపు రిజర్వేషన్ పై జగన్ వైఖరి సరికాదు
  • తమ డిమాండ్లను నెరవేర్చే పార్టీకే మద్దతన్న నేత 
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ పై కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మండపడ్డారు. కాపులకు రిజర్వేషన్ కు బదులుగా రూ.10,000 కోట్లు ఇస్తానని జగన్ చెప్పడం దారుణమన్నారు. ‘మీరు రూ.10 వేల కోట్లు ఇవ్వడం కాదు. మేమే మీకు రూ.20,000 కోట్లు ఇస్తాం. ఇతర కులస్తుడికి సీఎం పదవి ఇస్తారా?’ అని ముద్రగడ ప్రశ్నించారు.

ఈ రోజు గుడివాడలో కాపు సేవా సమితి వార్షికోత్సవ కార్యక్రమం జరిగింది. దానికి హాజరైన ముద్రగడ మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే కాపు కార్పోరేషన్ కు రూ.10 వేల కోట్లు ఇస్తానని జగన్ చెప్పడం సరికాదన్నారు. కాపు రిజర్వేషన్, ఇతర డిమాండ్లను నెరవేర్చే పార్టీకే తమ మద్దతు ఉంటుందని ముద్రగడ స్పష్టం చేశారు. అలాంటి పార్టీల పల్లకినే తాము మోస్తామని ముద్రగడ వ్యాఖ్యానించారు.
mudragada
kapu
reservation
Andhra Pradesh
YSRCP
js jagan
cm

More Telugu News