geeta govindam: 'గీత గోవిందం' లీక్ పై స్పందించిన విజయ్.. ఏడుపు వస్తోందని ట్వీట్!

  • హర్ట్ అయ్యానని వెల్లడి
  • కోపం వస్తోందన్న విజయ్
  • ఎడిటింగ్ విభాగం నుంచే సీన్ల లీక్
గీత గోవిందం సినిమా రిలీజ్ కు ముందే కొన్ని సీన్లు లీక్ కావడంపై ఆ చిత్ర హీరో విజయ్ దేవరకొండ పరోక్షంగా స్పందించాడు. ‘నేను చాలా నిరాశకు లోనవుతున్నా. హర్ట్ అయ్యా. ఒకసారి కోపం వస్తుంది. ఇంకోసారి ఏడుపొస్తుంది’ అని ట్వీట్ చేశాడు. దీంతో విజయ్ ఈ ట్వీట్ ను ఎందుకు చేశాడబ్బా అని పలువురు ఇంటర్నెట్ లో చర్చించుకున్నారు. సినిమా సీన్స్ లీక్ వ్యవహారంతో బాధపడి విజయ్ ఈ ట్వీట్ చేసుంటాడని నెటిజన్లు అనుకుంటున్నారు.

దీంతో కొందరు అభిమానులు.. ఎన్ని లీకులు ఎదురైనా మనకు బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని విజయ్ కు ధైర్యం చెప్పారు. చిల్ రౌడీ.. లైట్ తీసుకో అంటూ విజయ్ ను ఓదారుస్తున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన గీత గోవిందం ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గుంటూరులోని కేఎల్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల వద్ద సినిమా సీన్స్ దొరకటంతో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో సినిమా ఎడిటింగ్ విభాగం నుంచే లీకయిందని తేలింది.
geeta govindam
leak
movie
guntuir
Police

More Telugu News