Lok Sabha: మరింత విషమంగా సోమ్ నాథ్ చటర్జీ ఆరోగ్యం!

  • ఈనెల 10 న ఆసుపత్రిలో చేరిన చటర్జీ
  • వెంటిలేటర్ పై ఉంచి చికిత్స
  • అవయవాలు సహకరించడం లేదన్న వైద్యులు
సీనియర్ కమ్యూనిస్ట్ నాయకుడు, లోక్ సభ మాజీ స్పీకర్ సోమ్ నాథ్ చటర్జీ ఆరోగ్యం మరింతగా విషమించింది. ఈనెల 10వ తేదీన ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కోల్ కతాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే. 89 ఏళ్ల వయసులో ఉన్న ఆయనకు గత జూన్ లో స్ట్రోక్ వచ్చింది. ఆపై కిడ్నీ, శ్వాస సంబంధిత సమస్యలతోనూ ఆయన బాధపడుతున్నారని, పలు అవయవాలు చికిత్సకు సహకరించడం లేదని వైద్యులు వెల్లడించారు.

ప్రస్తుతం ఆయన్ను వెంటిలేటర్ పై ఉంచి చికిత్సను అందిస్తున్నామని, ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలియడంతో పలువురు వామపక్ష నేతలు ఆసుపత్రికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. కాగా, 1971 నుంచి 2009 మధ్య (1984 మినహా) ఆయన లోక్ సభలో ఎంపీగా ఉన్నారు.
Lok Sabha
Somanatha Chatarjee
Hospital
Kolkata

More Telugu News