ISIS: 900 హత్యలు, 200 రేప్ లు చేసిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాది... దిగ్భ్రాంతి కలిగిస్తున్న వీడియో ఇంటర్వ్యూ!

  • సెక్స్ బానిస సాయంతో ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్టు
  • తాను రేప్ చేయకుంటే చనిపోయి ఉండేవాడినన్న ఉగ్రవాది
  • హత్యలు, రేప్ లు కమాండర్ల విధి
  • ఇప్పుడు మరణం కోసమే ఎదురుచూస్తున్నానన్న కమాండర్
ఐఎస్ఐఎస్ కు చెందిన ఒక ఉగ్రవాది ఇచ్చిన తాజా ఇంటర్వ్యూ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనమై, దాన్ని చూసిన వారికి దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఇంటర్వ్యూలో స్టాసీ అనే జర్నలిస్టు, గతంలో ఐఎస్ఐఎస్ సెక్స్ బానిసగా పనిచేసి బయటకు వచ్చిన షిరీన్ అనే యువతి సాయంతో ప్రస్తుతం ఇరాక్ లోని మోసుల్ పట్టణంలోని జైల్లో ఉన్న ఓ ఉగ్రవాదిని ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో స్టాసీ ఇంగ్లీషులో ప్రశ్నలు అడుగుతుంటే, వాటిని అనువదించిన షరీన్, అవే ప్రశ్నలను ఉగ్రవాది ముందుంచింది.

తాను ఐఎస్ఐఎస్ కమాండర్ గా పని చేస్తున్న సమయంలో సుమారు 900 మందిని హత్యచేశానని అతను చెప్పగా అవాక్కైంది. రోజుకో అమ్మాయి చొప్పున 200 మంది మహిళలపై తాను అత్యాచారాలు చేశానని కూడా అతను అంగీకరించాడు. తాను అత్యాచారం చేసిన వారిలో 15, 16 ఏళ్ల అమ్మాయిల నుంచి 50 ఏళ్ల మహిళల వరకూ   ఉన్నారని చెప్పాడు. తాను రేప్ చేసిన వారిలో అత్యధికులు అయిష్టంగానే తనతో గడిపేవారని, ఎందుకంటే ఆ తర్వాత వారు ఏడుస్తుండటాన్ని తాను చూశానని చెప్పాడు. తాను రేప్ చేయకుంటే, తన పై కమాండర్ తనను హత్య చేసుండేవాడని, కమాండర్ గా హత్యలు, రేప్ లు తన విధి అని చెప్పాడు. ఐఎస్ఐఎస్ కమాండర్లలో తనవంటి వారు కొన్ని వందల మంది ఉన్నారని చెప్పాడు. తానిప్పుడు మరణం కోసమే ఎదురు చూస్తున్నానని చెప్పాడు.

ఇంటర్వ్యూ సమయంలో చేతులకు బేడీలతో కనిపించిన ఈ ఉగ్రవాదికి కాపలాగా కొందరు పొలీసు అధికారులు కూడా నిలబడి ఉండటం ఈ వీడియోలో కనిపిస్తోంది. చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదని, అమ్మాయిల కన్నీరు ఇంత కాలానికి నీకు శాపంలా తగలనుందని ఈ సందర్భంగా షరీన్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఆ ఉగ్రవాది వీడియోను మీరూ చూడవచ్చు.
ISIS
Comander
Terrorist
Rape
Murder

More Telugu News