Andhra Pradesh: పీడీ అకౌంట్ల వివాదం: టీడీపీ ప్రభుత్వంపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన జీవీఎల్

  • పీడీ అకౌంట్లలో భారీ ఎత్తున నగదును జమ చేసింది
  • 58,038 అకౌంట్లను తెరిచింది
  • సీబీఐ విచారణ, కాగ్ స్పెషల్ ఆడిట్ కు ఆదేశించండి
తెలుగుదేశం ప్రభుత్వంపై దాడిని ముమ్మరం చేసిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు గవర్నర్ నరసింహన్ కు ఓ ఫిర్యాదు లేఖ రాశారు. ఏపీ రాష్ట్ర పీడీ అకౌంట్స్ లో భారీ ఎత్తున నగదును జమ చేయడంపై సీబీఐ విచారణ, కాగ్ స్పెషల్ ఆడిట్ కు ఆదేశించాలని లేఖలో కోరారు. పీడీ అకౌంట్స్ లో భారీ స్కామ్ జరిగిందని ఆరోపించారు. సుమారు రూ. 53,038 కోట్ల ప్రజాధనాన్ని పీడీ అకౌంట్స్ లో ప్రభుత్వం వేసిందని తెలిపారు. మొత్తం 58,539 పీడీ అకౌంట్లను ఏపీ ప్రభుత్వం తెరిచిందని పేర్కొన్నారు. 2016-17 కాగ్ రిపోర్టును చూస్తే, భారీ కుంభకోణం జరిగినట్టు తెలుస్తోందని చెప్పారు. 
Andhra Pradesh
Telugudesam
government
pd account

More Telugu News