luxury cars: ఢిల్లీలో 500 లగ్జరీ కార్లను దొంగిలించిన హైదరాబాదీ!

  • ప్రతి సంవత్సరం 100 కార్లను దొంగిలించడమే లక్ష్యం
  • పంజాబ్, రాజస్థాన్, యూపీ తదితర రాష్ట్రాల వ్యక్తులకు అమ్మకం
  • సఫ్రుద్దీన్ తలపై లక్ష రూపాయల రివార్డు
ఢిల్లీలో దాదాపు 500 లగ్జరీ కార్లను దొంగిలించిన దొంగను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. ఈ చోరాగ్రేశుడు హైదరాబాదుకు చెందిన వ్యక్తి కావడం గమనార్హం. ఇతనిపై లక్ష రూపాయల రివార్డు కూడా ఉంది. సఫ్రుద్దీన్ (29) అనే వ్యక్తి తన గ్యాంగ్ తో కలసి హైదరాబాదు నుంచి ఢిల్లీకి విమానంలో వచ్చి, పని పూర్తయిన తర్వాత మళ్లీ విమానంలో హైదరాబాద్ వెళ్లిపోయేవాడు. అరెస్ట్ ల నుంచి తప్పించుకోవడానికే ఇలా చేశాడు. విచారణ సందర్భంగా పలు విషయాలను సఫ్రుద్దీన్ వెల్లడించాడు. ఢిల్లీలో ప్రతి సంవత్సరం 100 లగ్జరీ కార్లను దొంగిలించడమే తాము లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పాడు. వీటిని పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లతో పాటు ఇతర రాష్ట్రాల్లోని వ్యక్తులకు అమ్మేస్తామని తెలిపాడు.
luxury cars
steal
delhi

More Telugu News