chiranjeevi: చిన్నల్లుడికి చిరూ ఇచ్చిన సలహా!

షార్ట్స్‌లో చూడండి
చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ హీరోగా ఇటీవల 'విజేత' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. చిరంజీవితో పాటు అల్లు అర్జున్ .. చరణ్ ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నా ప్రయోజనం లేకుండా పోయింది. సినిమా ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేదు. లుక్స్ పరంగాను .. నటన పరంగాను ఫరవాలేదనిపించుకున్న కల్యాణ్, డాన్స్ విషయంలో మాత్రం తక్కువ మార్కులే సంపాదించుకున్నాడు.

అయినా కల్యాణ్ హీరోగా మరో సినిమా సెట్స్ పైకి వెళ్లనుందనే టాక్ వినిపించింది. అందులో వాస్తవం లేదన్నది తాజా సమాచారం. కల్యాణ్ ఉత్సాహాన్ని కాదనలేక ఆయన ఫస్టు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చిరంజీవి, రెండవ సినిమా విషయంలో తొందర పడొద్దని చెప్పారట. నటన విషయంలో మరింత శ్రద్ధ పెట్టమనీ .. డాన్స్ పై పూర్తిగా మనసు పెట్టమని కల్యాణ్ కి చిరంజీవి సలహా ఇచ్చారని అంటున్నారు.

మెగా హీరోలు డాన్స్ లో తిరుగులేదనిపించుకుంటూ వస్తున్నారు. అందువలన మరికొంత కాలం శిక్షణ తీసుకుని రంగంలోకి దిగమని అన్నారట. ప్రస్తుతం ఆ విషయాలపై కల్యాణ్ దృష్టి పెట్టగా, ఆయన నెక్స్ట్ మూవీని ఓ స్టార్ డైరెక్టర్ తో చేయాలనే ఆలోచనలో చిరంజీవి ఉన్నారని తెలుస్తోంది. 
Go Back to Shorts
chiranjeevi
kalyan

More Telugu News