ttd: టీటీడీ చైర్మన్ తో ఉద్యోగ సంఘాల చర్చలు సఫలం.. సమ్మె విరమణ!

  • టీటీడీ ఉద్యోగ సంఘాల సమస్యలన్నీ పరిష్కరిస్తాం
  • ఈ విషయం వారికి స్పష్టంగా చెప్పాం
  • 16 నుంచి తలపెట్టిన సమ్మెను విరమించారు: పుట్టా
ఈ నెల 16 నుంచి తలపెట్టిన సమ్మెను టీటీడీ ఉద్యోగ సంఘాలు విరమిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తో టీటీడీ ఉద్యోగ సంఘాలు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఈ సందర్భంగా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ, టీడీడీ ఉద్యోగ సంఘాల సమస్యలన్నీ పరిష్కరించేందుకు సానుకూలంగా ఉన్నామని వారికి స్పష్టంగా చెప్పామని అన్నారు. ఉద్యోగులకు సంబంధించి తమ పరిధిలో ఉన్న సమస్యలను, బోర్డు ద్వారా పరిష్కరించాల్సిన సమస్యలను పరిష్కరిస్తామని చెప్పామని అన్నారు. ఉద్యోగుల సమస్యల్లో కొన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాల్సినవి ఉన్నాయని..ఆ పని కూడా చేస్తామని ఉద్యోగ సంఘాలకు చెప్పామని అన్నారు. తమ సమస్యలను విని ఇంత సామరస్యంగా స్పందిస్తారని అనుకోలేదని ఉద్యోగ సంఘాలు సంతోషం వ్యక్తం చేశాయని, 16 నుంచి తలపెట్టిన సమ్మెను విరమిస్తున్నట్టు చెప్పాయని అన్నారు.    
ttd
employees union

More Telugu News