kcr: వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతాం!: ప్రొఫెసర్ కోదండరామ్

  • ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయాలు కోరుకుంటున్నారు
  • టీఆర్ఎస్ వి తక్షణ రాజకీయ అవసరాలు  
  • తాము గెలిచి అధికారంలోకొస్తే లక్ష ఉద్యోగాలిస్తాం
 రాష్ట్ర ప్రజల కోసమే తాము 'తెలంగాణ జన సమితి' (టీజేఎస్) పార్టీని నెలకొల్పామని ఆ పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తక్షణ రాజకీయ అవసరాల కోసమే టీఆర్ఎస్ పనిచేస్తోందని, విభజన హామీలు అమలు చేసేలా ఉద్యమం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయాలు కోరుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని, తాము గెలిచి  అధికారంలోకొస్తే లక్ష ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు.  
kcr
prof.kodandaram

More Telugu News