Chittoor: ఎర్రని పైట చెంగు, తలలో పూలతో వచ్చి 'మోదీ బావా' అంటూ చప్పట్లు కొడుతూ శివప్రసాద్ నిరసన!

  • నేడు హిజ్రా వేషంలో వచ్చిన చిత్తూరు ఎంపీ
  • హోదా ఇవ్వకుంటే మోదీ అంతం మొదలైనట్టే
  • పాటలు పాడుతూ నిరసన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ రోజుకో వేషం వేసుకుని వచ్చి పార్లమెంట్ ముందు నిరసనలు తెలుపుతున్న చిత్తూరు ఎంపీ శివప్రసాద్, నేడు హిజ్రా వేషంలో వచ్చారు. మెడలో ఎరుపు రంగు పైట, తలలో కనకాంబరాలు పెట్టుకుని, తాను నేడు థర్డ్ జండర్ల ప్రతినిధిగా మోదీని నిలదీయడానికి వచ్చానని చెబుతూ, "మోదీ బావా.." అంటూ తనదైన శైలిలో చప్పట్లు కొట్టారు. "ప్రత్యేక హోదా ఇవ్వకుంటే నీ అంతం ఆరంభం" అంటూ ఓ గీతాన్ని ఆలపించారు. మాటలెన్నో చెప్పావుగానీ, చేతల్లో ఏమీ చూపలేదంటూ సెటైర్లు వేశారు. కాగా, నిన్న శివప్రసాద్ హిట్లర్ వేషంలో వచ్చి నిరసనలు తెలిపిన సంగతి తెలిసిందే.
Chittoor
MP
Sivaprasad
Parliament
Protest

More Telugu News