Mahesh Babu: 'గూఢచారి' కథానాయిక శోభితపై మహేష్ బాబు ఫ్యాన్స్ ఆగ్రహం!

  • 'గూఢచారి' సినిమా బాగుందని మహేష్ కితాబు
  • శోభితా దూళిపాళ నటనపై ప్రశంసలు
  • శోభిత స్పందన అరకొరగా ఉందంటున్న ఫ్యాన్స్
  • సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టులు
తమ హీరో ఎన్టీఆర్ కు నటుడు ఆదర్శ్ బాలకృష్ణ సరైన గౌరవం ఇవ్వలేదని ఆయన ఫ్యాన్స్ జరిపిన ట్రోల్ ను మరువకముందే, మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ట్రోలింగ్ మొదలెట్టారు. ఇటీవల 'గూఢచారి' చిత్రాన్ని చూసిన మహేష్ బాబు, ఆ సినిమా చాలా బాగుందని కితాబిస్తూ, తన సోషల్ మీడియాలో ఓ పోస్టును ఉంచారు.

ఈ చిత్రంలో తొలిసారిగా నటించిన శోభితా ధూళిపాళ చక్కగా నటించిందన్నారు. దీనిపై శోభిత స్పందన అరకొరగా ఉందని, తమ అభిమాన హీరోకు ఆమె సరైన గౌరవం ఇవ్వలేదని ఫ్యాన్స్ గొడవ ప్రారంభించారు. ఆమెకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులను వైరల్ చేస్తున్నారు.
Mahesh Babu
Gudhachari
Sobhita Dhulipala
Fans
Trolling

More Telugu News