Indigo: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. విజయవాడ నుంచి నేరుగా సింగపూర్‌కు విమాన సర్వీసులు!

  • ప్రభుత్వ ప్రతిపాదనకు ముందుకొచ్చిన ఇండిగో
  • వారానికి మూడుసార్లు సర్వీసులు
  • విమానంలో 60 సీట్లు
 విజయవాడ నుంచి సింగపూర్‌కు నేరుగా విమాన సర్వీసులు నడపాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఫలితాలు ఫలించాయి. ఏపీ వాసులు ఇప్పటి వరకు సింగపూర్ వెళ్లాలంటే హైదరాబాద్ వచ్చి వెళ్లాల్సి ఉండగా, ఇకపై విజయవాడ నుంచే నేరుగా సింగపూర్ వెళ్లే అవకాశం రానుంది. దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సింగపూర్‌కు విమానాలు నడిపేందుకు ముందుకొచ్చింది. ఇందుకు రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఫలితంగా ఈనెల 27, లేదంటే వచ్చే నెల 2 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. కచ్చితమైన తేదీని త్వరలో ప్రకటిస్తారు. 60 సీట్లున్న ఇండిగో విమానం వారానికి రెండుమూడు సార్లు విజయవాడ-సింగపూర్‌ మధ్య తిరగనుంది.  
Indigo
Andhra Pradesh
Vijayawada
Singpore

More Telugu News