YSRCP: 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయితే ఇంత భయమెందుకు?: చంద్రబాబుపై నటుడు పృధ్వీ సంచలన వ్యాఖ్యల వీడియో

  • 40 ఏళ్ల జగన్ ను చూసి భయం ఎందుకు
  • నేను, పోసాని, కృష్ణుడు కుక్కలమా? 
  • కుక్కలంటే విశ్వాసంగా ఉంటాయిరా బచ్చాల్లారా
  • వంచనపై గర్జనలో పృధ్వీ వ్యాఖ్యలు
తనకు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు, 40 ఏళ్ల వైఎస్ జగన్ ను చూసి ఎందుకు భయపడుతున్నారని '30 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ'గా గుర్తింపు పొందిన హాస్య నటుడు పృధ్వీరాజ్ వ్యాఖ్యానించారు. నిన్న గుంటూరులో జరిగిన 'వంచనపై గర్జన' దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

"నోటికి ఏది వస్తే అది మాట్లాడటం. ఏదన్నా అంటే 40 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ. 40 ఇయర్స్ ఇండస్ట్రీ పొలిటికల్ అంటున్నప్పుడు 40 ఏళ్ల జగన్ మోహన్ రెడ్డిని చూసి ఎందుకు భయపడుతున్నారు? సమాధానం చెప్పండి. నన్ను, పోసానిని, కృష్ణుడిని కుక్కలమని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కుక్కలంటే విశ్వాసంగా ఉంటాయిరా బచ్చాల్లారా... కాపలా కుక్కలాగా ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి" అని అన్నారు.

రాష్ట్రంలో ప్రత్యేక హోదా అంశం నిలబడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. తనకు ఎక్కడ పశువులు కనిపించినా వాటిల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల ముఖాలే కనిపిస్తున్నాయని సెటైర్లు వేశారు. 

YSRCP
Jagan
Vanchanapai Garjana
Prudhvi

More Telugu News