gvl: జీవీఎల్ మా మీద పెత్తనం చేస్తానంటే ఎందుకు ఊరుకుంటాం?: నారా లోకేశ్

  • జీవీఎల్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ లోకేశ్
  • ఆయన రోజుకో ఆరోపణ చేస్తారు!
  • దానికి నేను సమాధానం చెప్పాలా?
చంద్రబాబు తనయుడు రాజకీయాల్లోకి రాగానే, టీడీపీని భ్రష్టుపట్టిన కాంగ్రెస్ పార్టీకి స్టెప్నీగా తయారు చేశారని బీజేపీ నేత జీవీఎల్ చేసిన వ్యాఖ్యలపై నారా లోకేశ్ మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జీవీఎల్ చెప్పిన దానికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరముందా? ఆయన ఆంధ్రా ఎంపీ కాదు. ఎక్కడో ఎంపీ అయి వచ్చి.. మన మీద పెత్తనం చేయాలనుకుంటే ఎందుకు ఊరుకుంటాము? ఆయన రోజుకో ఆరోపణ చేస్తారు! దానికి నేను సమాధానం చెప్పాలా? అసలు, జీవీఎల్ గారు ఎవరో కూడా నాకు తెలియదు. నాలుగు సంవత్సరాలు ఆయన ఎక్కడా కనపడలా!’ అంటూ లోకేశ్ విమర్శించారు.
gvl
Nara Lokesh

More Telugu News