vijayasai reddy: ఆ రెండు పార్టీలతో కలిసి టీడీపీ రాజకీయ వ్యభిచారం చేస్తోంది: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

  • ఏపీకి కాంగ్రెస్, బీజేపీలు రెండూ తీరని ద్రోహం చేశాయి
  • ప్రత్యేక హోదాను చట్టంలో ఎందుకు పొందుపరచలేదు?
  • ఏపీని అభివృద్ధి చేస్తామన్న బీజేపీ మాట ఏమైంది?
ఏపీకి ద్రోహం చేసిన రెండు పార్టీలు కాంగ్రెస్, బీజేపీలతో కలిసి టీడీపీ రాజకీయ వ్యభిచారం చేస్తోందని వైసీపీ పార్లమెంట్ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి కాంగ్రెస్, బీజేపీలు రెండూ తీరని ద్రోహం చేశాయని ఆరోపించారు.

ప్రత్యేక హోదాను చట్టంలో పొందుపరచకుండా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నాడు రాజ్యసభలో చెప్పారని, ఏపీకి కాంగ్రెస్ పార్టీ చేసిన తీరని ద్రోహం ఇదని అన్నారు. ఏపీని అభివృద్ధి చేస్తామని, పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ కూడా ద్రోహానికి పాల్పడిందని మండిపడ్డారు. మిత్రపక్షాల అభ్యర్థిని పోటీగా పెడతామని చెప్పిన కాంగ్రెస్ తన అభ్యర్థిని నిలిపి మోసం చేసిందని అన్నారు. అందుకే, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తాము మద్దతు ఇవ్వలేదని విజయసాయిరెడ్డి అన్నారు.
vijayasai reddy
Congress
Telugudesam

More Telugu News