gvl: టీడీపీ ప్రభుత్వాన్ని త్వరలో ప్రజల ఎదుట దోషిగా నిలబెడతా: జీవీఎల్

  • రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా హరివంశ్ ఎన్నికయ్యారు
  • ‘కాంగ్రెస్ ’తో కలిసి టీడీపీ ఘోర పరాజయం పొందింది
  • టీడీపీ సరైన సమాధానాలు చెప్పే వరకూ విడిచిపెట్టను
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్నికయ్యారని, టీడీపీకి మరో దారుణమైన పరాభవం ఎదురైందని బీజేపీ పార్లమెంట్ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘కాంగ్రెస్ ’తో కలిసి టీడీపీ ఘోర పరాజయానికి గురైందని, ఆ పార్టీ చెంత చేరిన తెలుగుదేశం పార్టీ అవినీతి గబ్బులో చేరిందని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వాన్ని త్వరలో ప్రజల ఎదుట దోషిగా నిలబెడతానని, అవినీతిలో కూరుకుపోయిన టీడీపీని ప్రజలు తిరస్కరిస్తారని, వారి స్కామ్ లపై తాను మాట్లాడుతుంటే వాళ్లెందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. టీడీపీ నేతలు సరైన సమాధానాలు చెప్పేంత వరకు వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు.
gvl
Telugudesam

More Telugu News