liquor shop: కరుణానిధి మరణంతో నెల్లూరుకు పోటెత్తిన తమిళ తంబీలు!

  • మద్యం దొరక్క మందుబాబుల విలవిల
  • సూళ్లూరు పేట, తడకు భారీగా రాక
  • కిటకిటలాడిన మద్యం షాపులు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి అంత్యక్రియలు బుధవారం ముగిశాయి. కానీ పలువురు తమిళులు మాత్రం నెల్లూరు జిల్లాకు పోటెత్తారు. కరుణ మరణంతో, నెల్లూరుకు ఏం సంబంధం అనుకుంటున్నారా? వారంతా పోటెత్తింది మరెందుకో కాదు.. మందు దొరక్కపోవడంతోనే.

కరుణానిధి మంగళవారం సాయంత్రం చనిపోగానే తమిళనాడులోని మద్యం షాపుల్ని మూసేశారు. రెండ్రోజుల పాటు షాపులు ఓపెన్ కాకపోవడంతో మందు బాబులు అల్లాడిపోయారు. బస్సు దొరికితే బస్సు, రైలు దొరికితే రైలు ఎక్కి నెల్లూరు జిల్లాలోని తడ, సూళ్లూరు పేటలో దిగిపోయారు. దీంతో ఈ మార్గంలో తిరిగే వాహనాలన్నీ ప్రయాణికులతో నిండిపోయాయి. తొలుత మద్యం షాపుల ముందు సందడిని చూసి ఆశ్చర్యపోయిన ప్రజలు చివరికి విషయం తెలుసుకుని నవ్వుకున్నారు. 
liquor shop
Tamilnadu
Nellore District
karunanidhi

More Telugu News