ఇండియాలో మొట్టమొదటి ఐకియా స్టోర్ హైదరాబాద్ లో ప్రారంభం!

షార్ట్స్‌లో చూడండి
స్వీడన్ కి చెందిన ఐకియా ఫర్నీచర్ దిగ్గజం తన నూతన స్టోర్‌ను తాజాగా నేడు హైదరాబాద్ హైటెక్స్‌లో లాంచ్ చేసింది. కాసేపటి క్రితం తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ స్టోర్‌ను ప్రారంభించారు. ఇండియాలో ఐకియా ఏర్పాటు చేసిన మొట్టమొదటి స్టోర్ కూడా ఇదే కావడం విశేషం. 4 లక్షల చదరపు అడుగుల్లో ఏర్పాటు చేసిన ఈ స్టోర్లో దాదాపుగా 7500 స్వీడిష్ బ్రాండ్లు ఉన్నాయి.

అలాగే, దాదాపు 1000 రకాల వస్తువులు కేవలం రూ.200లకే కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి. ఈ స్టోర్‌లో దాదాపు 950మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా ఉపాధి పొందగా, మరో 1500మంది పరోక్షంగా ఉపాధి పొందనున్నారు. కాగా, 2025నాటికి దేశంలోని ప్రధాన నగరాలలో దాదాపు 25 ఐకియా స్టోర్లని అందుబాటులోకి తీసుకురావాలని ఐకియా సంస్థ భావిస్తోంది. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ తో పాటు ఐకియా గ్రూప్ సీఈవో జెస్పర్ బ్రోడిన్, ఐకియా ఇండియా సీఈవో పీటర్ బెట్జెల్ తదితరులు పాల్గొన్నారు.
Go Back to Shorts
KTR
KCR
Hyderabad'
Hyderabad District
Telangana
India
sweden
IKEA

More Telugu News