Bharat bandh: డిమాండ్ నెరవేరింది.. భారత్ బంద్‌ను ఉపసంహరించుకుంటున్నాం: దళిత సంఘాలు

  • సవరణలకు అంగీకరించని దళిత సంఘాలు
  • ఈ రోజు భారత బంద్‌కు పిలుపు
  • అట్రాసిటీ బిల్లును యథాతథంగా ఆమోదించిన లోక్‌సభ
ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం కోర్టు ఉత్తర్వులను నిరసిస్తూ ఆలిండియా అంబేద్కర్ మహాసభ (ఏఐఏఎం) ఆధ్వర్యంలో నేడు (గురువారం) నిర్వహించతలపెట్టిన బంద్‌ను దళిత సంఘాలు విరమించుకున్నాయి. ఎస్సీ, ఎస్టీ సవరణ బిల్లు లోక్‌సభలో అంగీకారం పొందడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. తామేం కోరుకుంటున్నామో అది నెరవేరిందని, అందుకనే బంద్‌ను ఉపసంహరించుకుంటున్నామని ఏఐఏఎం తెలిపింది. దీంతో కేంద్రానికి పెద్ద ఉపశమనం లభించినట్టు అయింది. 

ఎస్సీ,ఎస్టీ చట్టం వల్ల అమాయకులపై వేధింపులు ఎక్కువ అవుతున్నాయని, దీనిలో సవరణలు అవసరమని మార్చి 20న సుప్రీంకోర్టు పేర్కొంది. దీంతో సవరణలకు కేంద్రం రెడీ అవడంతో వివాదం రాజుకుంది. 

చట్టాన్ని సవరిస్తే దళితులపై దాడులు మరిన్ని పెరిగే అవకాశం ఉందని దళిత సంఘాలు రోడ్డెక్కాయి. అట్రాసిటీ చట్టంలో మార్పులను అంగీకరించేది లేదని తేల్చి చెప్పాయి. ఇందులో భాగంగా నేడు భారత బంద్‌కు పిలుపు ఇచ్చాయి. దీంతో స్పందించిన ప్రభుత్వం అట్రాసిటీ చట్టానికి ఎటువంటి సవరణలు లేకుండానే యథాతథంగా ఆమోదించింది. దీంతో దళిత సంఘాలు బంద్‌ పిలుపును వెనక్కి తీసుకున్నాయి.  
Bharat bandh
SC ST
Dalit groups
Call off

More Telugu News