Jayalalitha: జయలలిత, కరుణానిధి... ఇద్దరి చివరి కార్యక్రమాలూ 2016 సెప్టెంబర్ లోనే!

  • ఇద్దరి చివరి కార్యక్రమాలూ 2016 సెప్టెంబర్ లోనే
  • మెట్రో రైలు సేవలను ప్రారంభించిన జయలలిత
  • డీఎంకే కార్యకర్తలతో సమావేశమైన కరుణానిధి
తమిళనాడుకు దశాబ్దాల పాటు సేవలందించిన జయలలిత, కరుణానిధిలు పాల్గొన్న చివరి కార్యక్రమాలు ఒకే నెలలో జరగడం యాదృచ్చికం. 2016లో రాష్ట్రానికి సీఎంగా ఉన్న జయలలిత సెప్టెంబర్ 21న చెన్నైలో జరిగిన మెట్రో రైలు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. లిటిల్ మౌంట్ నుంచి విమానాశ్రయం వరకూ రైలు సేవలను జెండా ఊపి ప్రారంభించారు. ఆపై ఆమె బయట మరెక్కడా కనిపించలేదు.

ఇక డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి కూడా బయట చివరిసారిగా కనిపించింది అదే సంవత్సరం అదే నెల కావడం గమనార్హం. 2016 సెప్టెంబర్ 17న చెన్నైలోని అన్నా అరివాలయంలో 'డీఎంకే ముప్పెరుం విళా' జరుగగా, కరుణానిధి పాల్గొని తన సహజత్వానికి భిన్నంగా భావోద్వేగంతో ప్రసంగించారు. తాను పాల్గొనే చివరి వేడుక ఇదేనని చెప్పారు. ఆ మరుసటిరోజు అక్కడే జరిగిన పార్టీ జిల్లాల కార్యదర్శులతో సమావేశమైన ఆయన, ఆపై ఇంటికే పరిమితం అయ్యారు. వీరిద్దరూ 2016 సెప్టెంబర్ తరువాత బయటి ప్రపంచంలోకి రాలేదు.
Jayalalitha
Karunanidhi
Tamilnadu
September 2016

More Telugu News