karunanidhi: మద్రాస్ హైకోర్టు తీర్పుని ఆహ్వానించిన మమతా బెనర్జీ

  • అంత్యక్రియల నిర్వహణకు అనుమతించిన హైకోర్టు
  • ఆహ్వానించిన మమత
  • కరుణ దేశంలోనే సీనియర్ నేత అన్న దీదీ
కరుణానిధి అంత్యక్రియలను మెరీనా బీచ్ లో నిర్వహించుకునేందుకు మద్రాస్ హైకోర్టు అనుమతి ఇవ్వడాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆహ్వానించారు. దేశంలో సీనియర్ రాజకీయవేత్త కరుణ అని అన్నారు. ఆయన ఒక మహా నేత అని... ఆయన మరణం దేశానికి తీరని లోటు అని అన్నారు.

మరోవైపు జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ అజాద్ కరుణ పార్థివ దేహానికి నివాళి అర్పించారు. వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రస్తుతం కరుణానిధి అంతిమయాత్ర కొనసాగుతోంది.
karunanidhi
mamatha banerjee

More Telugu News