katasani: పాణ్యం నియోజవర్గం నుంచి వైదొలగే ప్రసక్తే లేదు: కాటసాని

  • ప్రజల ఆదరణ ఉన్నంత వరకు నియోజకవర్గాన్ని వీడను
  • జగన్ ను సీఎం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది
  • జగన్ ముఖ్యమంత్రి అయితేనే పేదల సమస్యలు పరిష్కారమవుతాయి
తాను పాణ్యం నియోజకవర్గాన్ని వీడే ప్రసక్తే లేదని... ప్రజల ఆదరణ ఉన్నంత వరకు ఇక్కడే ఉంటానని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. 2019 ఎన్నికల్లో తాను పాణ్యం నుంచే పోటీ చేస్తానని చెప్పారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. జగన్ సీఎం అయితేనే పేదల సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు.

వైసీపీని అధికారంలోకి తెచ్చేందుకు నేతలు, కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. ఓర్వకల్లు మండలం క్షేత్రస్థాయి పార్టీ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. నన్నూరులో ఫ్లై ఓవర్, హుసేనాపురంలో రింగ్ రోడ్డులను జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రారంభిస్తారని చెప్పారు.


katasani
rambhoopal reddy
jagan
YSRCP
panyam

More Telugu News