paruchuri: అద్భుతమైన నటుడు కైకాల సత్యనారాయణ: పరుచూరి గోపాలకృష్ణ

  • కైకాలతో 'ఇది కాదు ముగింపు' చేశాం 
  • ఈ సినిమాలో ఆయన నటన చూసి తీరాలి 
  • మాతో ఆయన ఓ 200 సినిమాలు చేసి వుంటారు
తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, కైకాల సత్యనారాయణ నటించిన 'ఇది కాదు ముగింపు' సినిమాను గురించి ప్రస్తావించారు. "ఈ సినిమాను చూసిన వాళ్లు సత్యనారాయణగారిని ప్రేమిస్తారు .. మమ్మల్ని ప్రేమిస్తారు. బిడ్డలను అదుపాజ్ఞలలో పెంచలేకపోయిన ఒక తండ్రి, రిటైర్ అయిన తరువాత తనని ఎవరూ చూడకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటాడు.

తండ్రిని పట్టుకుని .. ఆయనను మేము ఎందుకు చూడాలని ఒక్కొక్క బిడ్డా అడుగుతూ వుంటే, అప్పుడు సత్యనారాయణగారి అద్భుతమైన నటనను గురించి చెప్పడానికి మాటలు చాలవు .. చూడాలంతే. అన్నగారితో 99 సినిమాలు చేశాను, 100వ సినిమాను చేయలేకపోయానని కైకాలవారు అప్పుడప్పుడు చెప్పుకుని బాధపడుతూ వుండేవారు. ఇప్పుడు ఆయన అన్నగారి బయోపిక్ లో చేస్తున్నారని తెలిసింది .. అది వాళ్ల కాంబినేషన్లో 100వ చిత్రమని అనుకోవచ్చు. ఇక మేము చేసిన 350 సినిమాల్లో 200 సినిమాల్లోనైనా ఆయన చేసి ఉంటారు" అని అన్నారు.     
paruchuri
kaikala

More Telugu News