karunanidhi: కరుణకు ఘన నివాళి అర్పించిన పార్లమెంట్.. ఉభయసభలు వాయిదా!
- ఉభయసభల్లో కరుణకు నివాళి అర్పించిన సభ్యులు
- ఒక నిమిషం పాటు మౌనం
- గౌరవ సూచకంగా ఉభయసభలు వాయిదా
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి పార్లమెంటు ఘన నివాళి అర్పించింది. ఉదయం లోక్ సభ ప్రారంభం కాగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ సహా లోక్ సభ సభ్యులంతా లేచి నిలబడి ఓ నిమిషం పాటు మౌనం పాటించారు. అనంతరం సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.
మరోవైపు, రాజ్యసభలో కరుణానిధి సంతాప సందేశాన్ని ఛైర్మన్ వెంకయ్య నాయుడు చదివి వినిపించారు. సభ్యులంతా కరుణకు సంతాపం ప్రకటించి, నివాళులర్పించారు. ఓ నిమిషం పాటు మౌనం పాటించారు. అనంతరం కరుణకు గౌరవ సూచకంగా సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు వెంకయ్య ప్రకటించారు. రేపు ఉదయం ఉభయసభలు యథావిధిగా సమావేశమవుతాయి.