Karunanidhi: కరుణానిధి మరణంపై స్పందించిన బాలకృష్ణ!

  • అత్యుత్తమ రాజకీయ నేతను కోల్పోయాం
  • 5 సార్లు సీఎం, 13 సార్లు ఎమ్మెల్యే కావడం సాధారణ విషయం కాదు
  • కరుణ మరణం బాధాకరమన్న బాలకృష్ణ
భారతావని ఓ అత్యుత్తమ రాజకీయ నేతను కోల్పోయిందని హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి మృతిపట్ల ఆయన తన సంతాపాన్ని తెలుపుతూ ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.

"రాజకీయ నాయకులు కరుణానిధి మరణం రాజకీయాలకు మాత్రమే కాదు, చిత్రసీమకు కూడా తీరని లోటు. నాన్నగారితో ఆయనకు విశేషమైన అనుబంధం ఉండేది. 80 ఏళ్ల రాజకీయ అనుభవం, 5 సార్లు ముఖ్యమంత్రిగా, 13 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం అనేది మాములు విషయం కాదు. అటువంటి రాజకీయ చరిత్ర కలిగిన మహానుభావుడు, నేడు మన మధ్య లేకపోవడం బాధాకరం. ఆయన లోటు తీర్చలేనిది, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని బాలకృష్ణ నివాళులు అర్పించారు.  
Karunanidhi
Balakrishna
Facebook
Condolence

More Telugu News