paruchuri: కైకాల సత్యనారాయణపై కోపం వుండేది: పరుచూరి గోపాలకృష్ణ

  • 'సిపాయి కూతురు'తో సత్యనారాయణ వచ్చారు 
  • ఎన్టీఆర్ కి పోటీ అన్నారు 
  • ఎన్టీఆర్ కి చాలా దగ్గర పోలికలు ఉండేవి
తెలుగు సినిమాలకి సంభాషణల పరంగా కొత్తదనాన్ని తీసుకొచ్చిన రచయితలలో పరుచూరి బ్రదర్స్ ఒకరు. వాళ్ల డైలాగ్స్ కోసం జనం మళ్లీ మళ్లీ థియేటర్స్ కి వెళ్లిన సందర్భాలు వున్నాయి. అలా మంచి పేరు తెచ్చుకున్న పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన గోపాలకృష్ణ, తాజాగా తన 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో 'కైకాల సత్యనారాయణ' గురించి ప్రస్తావించారు.

"ఎస్వీ రంగారావు తరువాత నవరసాలను అంత అద్భుతంగా పలికించిన వారు కైకాల సత్యనారాయణ గారు. నేను ఎప్పుడూ ఆయనను 'కైకాల వారు' అనే పిలిచేవాడిని. ముందుగా ఆయనపై కోపం వుండేది .. 'సిపాయి కూతురు' సినిమాలో ఎన్టీఆర్ కి పోటీ అంటూ ఆయనను పెట్టడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయిన మా అందరికీ కోపాలు వచ్చేశాయి. 'రాముడు భీముడు' సినిమాలో సత్యనారాయణను డూప్ లా కూడా కాదు .. ఒకే పోలికలతో వున్నారని చెప్పేసి ఇద్దరినీ ఓకే ఫ్రేమ్ లో చూపించారు. అంత దగ్గర పోలికలతో సత్యనారాయణగారు ఉండటంతో అప్పటి నుంచి ఆయనను ప్రేమించడం మొదలుపెట్టాము" అని చెప్పుకొచ్చారు. 
paruchuri
kaikala

More Telugu News