Chennai: బ్రేకింగ్ న్యూస్... మెరీనా బీచ్ లో కరుణ అంత్యక్రియలకు మార్గం సుగమం!

  • బీచ్ లో అంత్యక్రియలకు అభ్యంతరం లేదు
  • కోర్టుకు తెలిపిన పిటిషన్ దారులు
  • కాసేపట్లో వెలువడనున్న తుది తీర్పు
కోట్లాది మంది డీఎంకే కార్యకర్తలు, అభిమానుల కల నెరవేరనుంది. తమ ప్రియనేత అంత్యక్రియలను మెరీనా బీచ్ లో చేయాలన్న వారి కోరిక తీరనుంది. కొద్దిసేపటి క్రితం మద్రాస్ హైకోర్టు ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. బీచ్ లో అంత్యక్రియలకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్లన్నింటినీ కోర్టు కొట్టివేసింది.

బీచ్ లో అంత్యక్రియలకు అభ్యంతరం లేదన్న పిటిషన్ దారుల నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నామని చెప్పింది. దీంతో మెరీనా బీచ్ లో కరుణానిధి అంత్యక్రియలకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ పై వాదనలు సాగుతుండగా, కాసేపట్లో కోర్టు తుది తీర్పు వెలువడనుంది. కరుణానిధి పార్థివదేహాన్ని ఉంచిన రాజాజీ హాల్ ప్రాంతంలో ఇదే విషయాన్ని మైకుల ద్వారా కార్యకర్తలకు చెప్పడంతో వారిలో ఆనందం పెల్లుబికింది. 
Chennai
Marina Beach
High Court

More Telugu News