Kuchibhotla srinivas: కూచిభొట్ల శ్రీనివాస్ హంతకుడికి మూడు యావజ్జీవ కారాగార శిక్షలు!

  • గతేడాది ఫిబ్రవరిలో హత్యకు గురైన శ్రీనివాస్
  • జాతి విద్వేష వ్యాఖ్యలు చేస్తూ కాల్పులు జరిపిన ప్యూరింటన్
  • దోషిగా తేల్చి శిక్షలు విధించిన కోర్టు
అమెరికాలో తెలుగు టెక్కీ కూచిభొట్ల శ్రీనివాస్ (32)ను హత్య చేసిన ఆడమ్ ప్యూరింటన్‌కు కోర్టు మూడు యావజ్జీవ కారాగార శిక్షలు విధిస్తూ తీర్పు వెలువరించింది. మూడింటిని ఒకదాని తర్వాత ఒకటి అమలు చేయాలని ఆదేశించింది. గతేడాది ఫిబ్రవరిలో కన్సాస్‌లోని ఓ బార్‌లో శ్రీనివాస్‌ను ప్యూరింటన్ కాల్చి చంపాడు.

జాతి విద్వేషంతో రగిలిపోయిన ఆడమ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇదే విషయాన్ని కోర్టులోనూ అంగీకరించాడు. ఈ కేసును విచారించిన జాన్సన్ కౌంటీ డిస్ట్రిక్ట్ కోర్టు ప్యూరింటన్‌ను దోషిగా నిర్ధారించి శిక్షలు విధించింది. మూడింటిని ఒకదాని తర్వాత మరోటి అమలు చేయాలని తీర్పులో స్పష్టం చేసింది.  
Kuchibhotla srinivas
America
Adam purinton
court

More Telugu News