karunanidhi: అత్యంత విషమంగా కరుణానిధి ఆరోగ్యం!

  • కరుణానిధి హెల్త్ బులెటిన్ విడుదల
  • కొన్ని గంటలుగా చికిత్సకు సహకరించని అవయవాలు 
  • వైద్యం అందిస్తున్నా కరుణ ఆరోగ్యం మెరుగుపడట్లేదు
చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు వైద్యులు పేర్కొన్నారు. కొద్ది సేపటి క్రితం కరుణానిధికి సంబంధించిన హెల్త్ బులెటిన్ ను వైద్యులు విడుదల చేశారు. కొన్ని గంటలుగా ఆయన అవయవాలు చికిత్సకు సహకరించడం లేదని తెలిపారు. కరుణానిధికి చికిత్స అందించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామని, వైద్య పరంగా తాము చేయగలిగింది చేస్తున్నామని పేర్కొన్నారు. కరుణకు అవసరమైన వైద్యం అందిస్తున్నా ఆయన ఆరోగ్యం మెరుగుపడటం లేదని తెలిపారు.
karunanidhi

More Telugu News