kumara swamy: కర్ణాటకలో అసలు సీఎం ఎవరు?: బీజేపీ ప్రశ్న
- కుమారస్వామి సోదరుడు రేవణ్ణ రెండో సీఎంగా వ్యవహరిస్తున్నారు
- పాలనలో దేవెగౌడ తల దూర్చుతున్నారు
- అసలు సీఎం ఎవరనే సందేహం ప్రజల్లో ఉంది
కర్ణాటకలో ముగ్గురు వ్యక్తులు సీఎంగా వ్యవహరిస్తున్నారని... వీరిలో అసలైన సీఎం ఎవరో చెప్పాలంటూ మాజీ ప్రధాని దేవెగౌడను బీజేపీ ప్రశ్నించింది. కుమారస్వామి సోదరుడు రేవణ్ణ రెండో సీఎంగా వ్యవహరిస్తున్నారని... కాంగ్రెస్ మంత్రుల శాఖల్లో కూడా ఆయన పెత్తనం చలాయిస్తున్నారని కర్ణాటక బీజేపీ శాఖ ట్వీట్ చేసింది.
జేడీఎస్ ఒక కుటుంబ పార్టీ అని దుయ్యబట్టింది. దేవెగౌడ కూడా రాష్ట్ర పాలనలో తల దూర్చుతున్నారని... ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు సీఎంలుగా పని చేస్తున్నారని విమర్శించింది. మీలో అసలు సీఎం ఎవరో అనే సందేహం ప్రజల్లో నెలకొందని... ముందు మీలో సీఎం ఎవరనే విషయాన్ని తేల్చుకోవాలని ఎద్దేవా చేసింది. మరోవైపు ఈ వ్యాఖ్యలను జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్.విశ్వనాథ్ తప్పుబట్టారు. బీజేపీ నేతలు అర్థవంతంగా మాట్లాడాలంటూ మండిపడ్డారు.