vijayakanth: కోలుకున్న విజయకాంత్.. కుటుంబసభ్యులతో విహారయాత్ర!

  • అనారోగ్య సమస్యలతో అమెరికాలో చికిత్స పొందిన విజయకాంత్
  • పక్షం రోజులకు పైగా చికిత్స పొందిన డీఎండీకే అధినేత
  • మరో వారం పాటు అమెరికాలోనే ఉండనున్న కెప్టెన్
డీఎండీకే అధినేత, ప్రముఖ సినీ నటుడు విజయకాంత్ కోలుకున్నారు. అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన అమెరికాలో చికిత్స పొందారు. ట్రీట్ మెంట్ కోసం తన భార్య ప్రేమలత, కుమారుడు షణ్ముగపాండియన్ లతో కలసి గత నెల 7న ఆయన అమెరికా వెళ్లారు.

పక్షం రోజులకు పైగా చికిత్స పొందిన ఆయన ఇప్పుడు కోలుకున్నారు. ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలసి అమెరికాలోని పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు. మరో వారం రోజులపాటు ఆయన అమెరికాలోనే ఉంటారని సమాచారం. విజయకాంత్ కోలుకున్నారనే వార్తతో డీఎండీకే శ్రేణులు, అభిమానులు సంతోషంలో మునిగిపోయారు.
vijayakanth
health
america
treatment

More Telugu News