Chandrababu: చేనేత కళాకారుడి అద్భుత ప్రతిభ.. పట్టువస్త్రంపై చంద్రబాబు.. చేనేత పథకాలకు అక్షర రూపం!

షార్ట్స్‌లో చూడండి

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన చేనేత కళాకారుడు నాగరాజు పట్టువస్త్రంపై చంద్రబాబు రూపాన్ని నేశారు. ముఖ్యమంత్రి ఫొటో పక్కనే చేనేత కార్మికుల కోసం రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను అక్షర రూపంలో పొందుపరిచారు. అలాగే, వస్త్రం అంచుల్లో రాష్ట్ర చిహ్నాలైన రామచిలుక, కృష్ణజింక, వేపచెట్టు ఆకృతులను అందంగా రూపొందించారు.

ఈ వస్త్రాన్ని నేసేందుకు తనకు నాలుగు రోజులు పట్టిందని నాగరాజు తెలిపారు. ప్రపంచ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దీనిని బహూకరించనున్నారు. నేడు చీరాలలో నిర్వహించే చేనేత దినోత్సవ కార్యక్రమంలో జిల్లా చేనేత, జౌళిశాఖ అధికారుల చేతుల మీదుగా నాగరాజు దీనిని చంద్రబాబుకు బహూకరిస్తారు.
Go Back to Shorts
Chandrababu
Anantapur District
Dhramavaram

More Telugu News